Thursday, March 27, 2025

TS TET: తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్ విడుదల..

  • రేపటి నుండి దరఖాస్తులు.. సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష..

అనన్య న్యూస్, హైదరాబాద్: నిరుద్యోగులకు తెలంగాణ విద్యాశాఖ శుభవార్త తెలిపింది. మంగళవారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ ను విడుదల చేసింది. బుధవారం నుంచి ఈ నెల 16 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష నిర్వహించి అదే నెల 27న ఫలితాలు వెల్లడించనున్నారు. https://tstet.cgg.gov.in లో టెట్ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొంది. ఇటీవల జరిగిన సమావేశంలో టెట్‌ నిర్వహణకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఎస్సీఈఆర్టీ అధికారులు టెట్‌ నిర్వహణపై ప్రతిపాదనలు రూపొందించి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు అందజేశారు. ఆయా ప్రతిపాదనలను విద్యాశాఖ ఆమోదించగా, టెట్‌ నిర్వహణపై అధికారులు కసరత్తు చేసి నోటిఫికేషన్‌ను రిలీజ్‌ చేశారు.

Ananya News
Ananya Newshttps://ananyanews.in
Ananya News is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular