అనన్య న్యూస్, హైదరాబాద్: భారత ప్రధాన మంత్రిగా వరుసగా మూడో సారి బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ, రైతుల సంక్షేమమే లక్ష్యంగా తొలి సంతకం చేశారు. పీఎం కిసాన్ పథకం కింద 17వ విడత నిధులను సోమవారం విడుదల చేశారు. పీఎం కిసాన్ పథకంలో భాగంగా దేశంలో 9.3 కోట్ల మంది రైతులకు రూ.2వేలు చొప్పున 20వేల కోట్ల రూపాయల నిధులు వారి ఖాతాల్లో జమకానున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తమ బలమైన సంకల్పాన్ని ప్రతిబింబించేలా పీఎం కిసాన్ నిధి 17వ విడత నిధుల విడుదల ఫైల్‌పై తొలి సంతకాన్ని చేశానని మోదీ తెలిపారు. రానున్న రోజుల్లో రైతుల జీవితాలను బాగుచేసే మరిన్ని అంశాలపై పనిచేస్తామని ప్రకటించారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని ప్రగతి దిశగా నడిపించే బాధ్యతను తీసుకుంటామని తెలిపారు.
Modi 3.0 First Signature: ప్రధానిగా మోదీ తొలి సంతకం.. రైతుల ఖాతాల్లోకి రూ.20 వేల కోట్లు..
RELATED ARTICLES