అనన్య న్యూస్, మహబూబ్ నగర్: పోలీస్ సిబ్బంది తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని జోగులాంబ జోన్ 7 డిఐజి ఎల్.ఎస్ చౌహన్ అన్నారు. జోగులాంబ జోన్ 7 లో 6 మంది ఆర్ముడు రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్ లకు ఆర్ముడు రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్స్ గా ప్రమోషన్ ఆర్డర్లను శనివారం జోగులాంబ జోన్ 7 డిఐజి ఎల్.ఎస్ చౌహన్ అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రమోషన్ పొందిన 6 మంది పోలీస్ సిబ్బందిని అభినందిస్తూ వారు తమ బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. సుదీర్ఘ సేవలు, క్రమశిక్షణ, కృషి పోలీస్ సేవలకు ప్రోత్సాహకంగా నిలుస్తాయని అన్నారు.
MBNR: బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలి: డిఐజి ఎల్.ఎస్ చౌహన్..
RELATED ARTICLES