అనన్య న్యూస్, మహబూబ్ నగర్: పోలీస్ సేవలపై ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియజేసేందుకు పోలీస్ స్టేషన్ లలో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డి. జానకి అన్నారు. ఆదివారం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ప్రజల అభిప్రాయాలు తమకి ఎంతో విలువైనవని, ప్రజలు తమకు అందుతున్న పోలీస్ సేవల గురించి తమ అభిప్రాయం తెలియజేసేందుకు క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో, సర్కిల్ కార్యాలయం, డీఎస్పీ కార్యాలయం, జిల్లా పోలీస్ కార్యాలయంలో అతికించడం జరిగిందని, పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ప్రజలు వారికి అందుతున్న సేవల గురించి 5 అంశాలపై తమ అభిప్రాయాన్ని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తెలియజేయాలని అన్నారు. జిల్లా ప్రజలు క్యూఆర్ కోడ్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకొని తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు.
MBNR: పోలీస్ సేవలపై ప్రజాభిప్రాయ సేకరణ: ఎస్పి డి. జానకి..
RELATED ARTICLES