అనన్య న్యూస్, జడ్చర్ల: వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని తెలంగాణ వాల్మీకి సంఘం నాయకులు అన్నారు. ఆదివారం మండల విద్య వనరుల కేంద్రం ఆవరణలో తెలంగాణ వాల్మీకి సంఘం నాయకులు మాట్లాడుతూ గతంలో ఉన్న ప్రభుత్వం వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చుతామని కాలయాపన చేశారని అన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమైన ఎన్నికల ప్రచారంలో భాగంగా వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చుతామని ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరారు. కార్యక్రమంలో జడ్చర్ల మండల అధ్యక్షులు సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు స్వామి నాయుడు, జడ్చర్ల యూత్ అధ్యక్షులు గుజ్జుల శివ, అయ్యన్న, బాల్ రాజ్, విష్ణు, శాంతయ్య తదితరులు ఉన్నారు.
JCL: వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలి: వాల్మీకి సంఘం..
RELATED ARTICLES