అనన్య న్యూస్,జడ్చర్ల: స్వాతంత్ర్య సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ సుభాష్ చంద్రబోస్ యువతకు స్ఫూర్తి దాయకమని కావేరమ్మ పేట గణేష్ యూత్ సేన సభ్యులు పేర్కొన్నారు. గురువారం సుభాష్ చంద్రబోస్ 128వ జయంతిని పురస్కరించుకుని గణేష్ యూత్ సేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కావేరమ్మపేట గ్రామ చావిడి దగ్గర ఉన్న నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఎక్కడైనా అన్యాయం జరిగితే యువత నేతాజీ ప్రతిరూపాలై అభ్యుదయ భావాలతో పోరాడాలన్నారు.
అన్యాయంతో రాజీపడటం అంటే అతి పెద్ద నేరం చేసినట్టేనన్న నేతాజీ మాటలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. కార్యక్రమంలో జడ్చర్ల మాజీ సర్పంచ్ బుక్క వెంకటేశం, నాయకులు బుక్క చెన్నయ్య, గిరమోని రవీందర్, గణేష్ యూత్ సేన సభ్యులు గోనెల నరేందర్, గుండు చంద్రశేఖర్, విజయ్ కుమార్, మిద్దె నాగరాజు, బుక్క శివ, గుండు శ్రీశైలం, బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి నవీన్, మల్లేష్, శేఖర్ గౌడ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.