- రానున్న ఎంపీ ఎన్నికల్లో 400 స్థానాలు పక్కా..
అనన్య న్యూస్, జడ్చర్ల: రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బిజెపికి 370 స్థానాలు, ఎన్డీఏ కూటమికి 400 స్థానాలు సాధించడంతో పాటు మరోసారి నరేంద్ర మోడీ ప్రధాని కావడం ఖాయమని మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం జడ్చర్ల బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 20వ తేదీన కృష్ణ మండలం నుంచి బస్సు యాత్ర ప్రారంభం అవుతుందన్నారు. ఈ యాత్రకు జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు నాయకత్వం వహిస్తారని తెలిపారు. బిజెపి కార్యకర్తలు బస్సు యాత్రను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలోని 543 పార్లమెంటు స్థానాలను 175 క్లస్టర్ గా విభజించారని, అందులో భాగంగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్లగొండ పార్లమెంట్ స్థానాలు ఒక క్లస్టర్ గా చేశారని అన్నారు.
రాబోయే రోజుల్లో నేరుగా ప్రజలకు లబ్ధి చేకూర్చే అనేక నిర్ణయాలను ప్రధాని తీసుకుంటున్నారని, దేశంలో జాతీయ రహదారులను ఎక్కువగా వేసిన ఘనత బిజెపి దేనిని, ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారబోతుందని, మోడీకి మద్దతు తెలిపి అధిక ఎంపీ సీట్లు గెలిపించాలని కోరారు. పార్లమెంటు అభ్యర్థుల ఎంపిక పూర్తిగా పార్టీ ఎన్నికల కేంద్ర కమిటీ చూసుకుంటుందని, ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పార్టీని గెలిపించాలని అన్నారు.
కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు రాపోతుల శ్రీనివాస్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు సామల నాగరాజు, మండల అధ్యక్షుడు రమేష్ జి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కృష్ణయ్య, అసెంబ్లీ కన్వీనర్ పులమని నర్సింహులు, జిల్లా అధికార ప్రతినిధి సామల నర్సింలు, జిల్లా కార్యవర్గ సభ్యుడు మధు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొంగలి శ్రీకాంత్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సాహిత్ రెడ్డి, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనాథ్, సీనియర్ నాయకులు సీతారాం, చువ్వ నాగరాజ్, టౌన్ ప్రధాన కార్యదర్శి వెంకట్, మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, మల్లేష్, ప్రశాంత్ రెడ్డి, శేఖర్, కిట్టు, సోషల్ మీడియా నవీన్ చారి తదితరులు పాల్గొన్నారు.