అనన్య న్యూస్, జడ్చర్ల: అక్రమంగా ఫిల్టర్ ఇసుక తయారు చేసిన, రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు చర్యలు తప్పవని, పీడీ యాక్ట్ నమోదు చేస్తామని జడ్చర్ల సిఐ ఆదిరెడ్డి హెచ్చరించారు. జడ్చర్ల మండలం ఉదండాపూర్ రిజర్వాయర్ లో తీసిన మట్టితో రిజర్వాయర్ లో కొందరు ఇసుక మాఫియా ఫిల్టర్ ఇసుక తయారు చేస్తున్నారు. దీంతో కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సిఐ ఆదిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఒంటిగంట సమయంలో దాడులు చేయడంతో దాదాపు 9 టిప్పర్లను అదుపులోకి తీసుకొని జడ్చర్ల పోలీస్ స్టేషన్ కి తరలించి విచారణ చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ అక్రమ ఫిల్టర్ ఇసుక రవాణా చేసిన, ఫిల్టర్ చేసి అమ్మిన కఠిన చర్యలు తప్పవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ తీసుకువస్తుందని, ప్రజలకు ఇసుకను అందించే విధంగా చర్యలు తీసుకుంటుందని అన్నారు.
JCL: ఫిల్టర్ ఇసుక తయారు చేస్తే కఠిన చర్యలు: సిఐ ఆదిరెడ్డి..
RELATED ARTICLES