- గోనెల సత్యనారాయణ జ్ఞాపకార్థం నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతం…
- రక్తదానం చేసిన 57 మంది మిత్రులు..
అనన్య న్యూస్, జడ్చర్ల: రక్తదానం చేయడం నేరుగా ప్రాణదానమేనని, ఆపదలో ఉన్న క్షతగాత్రులకు రక్తం ఇవ్వడం వారి ప్రాణాలను కాపాడినట్టేనని గోనెల సత్యం మిత్రబృందం పేర్కొన్నారు. ఈనెల 4వ తేదీన మృతి చెందిన కావేరమ్మ పేట గణేష్ యూత్ సేన సభ్యులు, శ్రీ బంగారు మైసమ్మ దేవాలయ కమిటీ కార్యవర్గ సభ్యుడు సభ్యుడు గోనెల సత్యనారాయణ జ్ఞాపకార్థం బుధవారం కావేరమ్మపేట గ్రంధాలయం ఎదురుగా సత్యనారాయణ మిత్రబృందం ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సహకారంతో 57 మంది మిత్రులు రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా సత్యం మిత్ర బృందం మాట్లాడుతూ సామాజిక సేవలో ముందుండే సత్యం మరణించడం చాలా బాధాకర విషయమని, సత్యం జ్ఞాపకార్థం రక్తదానం చేయడం ఆనందాన్ని కలిగించిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి, నాయకులు బుక్క వెంకటేశం, గుండు చంద్రమౌళి, సాగర్, జగదీష్ చారి, కౌన్సిలర్లు కుమ్మరి రాజు, విజయ్, రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్, గోనెల సత్యం మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు.
