- ఈ చెట్టు పెంచితే యమడేంజర్..
- ప్రాణాలకే ముప్పు రావొచ్చు..
- కోనో కార్పస్ మొక్కలతో మానవాళితో పాటు, పర్యావరణానికి ముప్పు..
- జడ్చర్ల మున్సిపాలిటీలో ఉన్న కోనో కార్పస్ చెట్లను తొలగించాల్సిన అవసరం ఉంది..
అనన్య న్యూస్, జడ్చర్ల: పచ్చని చెట్లు.. ప్రగతికి మెట్లు అని పెద్దలు చెప్పారు.. అందుకే ప్రభుత్వాలు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపడుతున్నాయి. పచ్చని చెట్లతో గాలిలో ఆక్సిజన్ శాతం పెరిగి ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. ఐతే అన్ని రకాల చెట్లు మనకి మంచి చేస్తాయంటే పొరబాటే. మానవాళితో పాటు పర్యావరణానికి కూడా ముప్పుగా పరిణమిస్తాయి. ఆలాంటి ప్రమాదకరమైన మొక్కల్లో కోనో కార్పస్ అనే మొక్క ఒకటి. అందరికీ అర్ధమయ్యేలా చెప్పాలంటే ప్రస్తుతం రోడ్ల పక్కన, డివైడర్లపైనా విరివిగా ఈ మొక్కలను నాటుతున్నారు. పచ్చదనం, అందం కోసం ఈ మొక్కలను విరివిగా పెంచేస్తున్నారు. అందం సంగతి అటుంచితే వీటివల్ల జరిగే నష్టమే అధికమంటున్నారు నిపుణులు.
ఈ చెట్లకు దుబాయ్ చెట్లు అనే పేరు కూడా ఉంది. ఇవి ఎక్కువగా అమెరికా ఖండంలోని తీరప్రాంతాల్లో పెరుగుతోంది. దీనికి వేగంగా పెరిగే లక్షణం ఉంది. అలాగే పచ్చగా అందంగా, శంఖు ఆకారంలో కపిస్తుంది. వేగంగా ఆకర్షణీయంగా పెరుగుతున్న ఈ మొక్కను నర్సరీల నిర్వాకరులు, ఇతర ల్యాండ్ స్కేప్ ఆర్టిస్టులు ఇండియాకు దిగుమతి చేశారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు ఆకర్షణీయంగా కనిపించేందుకు ఈ మొక్కలనే ఎంచుకుంటున్నారు. ఆ తర్వాత రోడ్లు అందంగా కనిపిస్తాయనే ఉద్దేశంతో డివైడర్లు, ఫుట్ పాత్ ల పక్కన ఈ చెట్లను నాటుతున్నారు.
కోనో కార్పస్ మొక్కల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ:
కోనో కార్పస్ మొక్కల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఈ చెట్లు పూల నుంచి అధికంగా పుప్పొడి వస్తుంది. ఇది గాలిలో కలవడం, మనుషులు పీల్చుకుంటే శ్వాసకోశ సమస్యలు రాడవం జరుగుతోంది. ముఖ్యంగా శీతాకాలంలో ఈ సమస్య అధికంగా ఉంటోంది. ఇప్పటికే పలుదేశాలు ఈ మొక్కను నిషేధించాయి. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లోనూ ఈ మొక్కలు నాటడాన్ని నిషేధించారు. తొలుత ఈ మొక్కలను విరివిగా నాటినా ఆ తర్వాత వీటి వల్ల జరుగుతున్న నష్టాలను గ్రహించి నాటడాన్ని నిలిపేశారు. ఈ మొక్కల కారణంగా పర్యావర సమతౌల్యత కూడా దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ చెట్టు వేరు భూగర్భంలో 80 మీటర్ల వరకూ వెళ్లి నీరును తాగేస్తుం దని, కోనో కార్పస్ పువ్వులోని పుప్పొడికారణంగా మానవాళితో పాటు పక్షులకు కూడా ప్రమాదం వాటిల్లే అవకాశాలున్నాయని, ఈ మొక్కలపై సీతాకోక చిలుకలు సైతం వాలడం లేదని, జంతువులు కూడా ఈ మొక్క ఆకులు తినడం లేదని పరిశోధకులు స్పష్టం చేసిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజప్రలు భయాందోళన చెందుతూ మొక్కలు తొలగిస్తున్నారు. ఈ మొక్కలు అటవీ ప్రాంతాల్లో పెరగడం వల్ల గడ్డిజాతి, ఇతర కలుపు మొక్కలు పెరగడం కష్టమవుతుందని తద్వార వన్య పాణాలకు ఆహారం దొరకదంటున్నారు. వన్యప్రాణుల సంఖ్య తగ్గింతే మాంసాహార జంతువులకు కూడా ఆహారం దొరక్క మనుగడ కష్ట మవుతుందట. ఇదిలా ఉంటే కొనో కార్పస్ చెట్ల వల్ల ఇతర చెట్లు వేగంగా పెరగకపోవడంతో పక్షులకు గూళ్లు ఏర్పాటు చేసుకోవడం కూడా కష్టతరంగా మారుతుంది. దీంతో సరైన ఆవాసం లేక పునరుత్పత్తి జరగదని.. పక్షుల జాతులు కూడా అంతరించిపోయే ప్రమాదం ఉందంటున్నారు. ఈ చెట్ల నుంచి వచ్చే ఒక రకమైన వాసన మనిషికి వికారాన్ని కలిగిస్తుంది.
తొలగించాల్సిన అవసరం ఉంది:
ఇదిలా ఉంటే జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట నల్లచెరువు మినీ ట్యాంక్ బండ్ పై, బాదేపల్లి నల్లకుంట మిని ట్యాంక్ బండ్ పై, ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా, జడ్చర్ల డిగ్రీ కాలేజ్ నుండి కల్వకుర్తి రోడ్డుపై, కావేరమ్మపేట రోడ్డుపై ప్రాథమిక హెల్త్ సెంటర్ నుండి ఉర్దూ మీడియం పాఠశాల వరకు, జడ్చర్ల నుండి మహబూబ్ నగర్ వెళ్లే రోడ్డుపై కొషగుట్ట రోడ్డు ఎదురు నుండి అప్పన్నపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి వరకు ఉన్న కోనో కార్పస్ చెట్లను తొలగించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. దీనిపై జాతీయ రహదారుల, ఆర్.అండ్.బి, మున్సిపల్ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి. వర్షాకాలం నేపథ్యంలో కోనో కార్పస్ చెట్లను తొలగించి వాటి స్థానంలో వేప, కానుగ, పూల జాతి మొక్కలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

