అనన్య న్యూస్, జడ్చర్ల: ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డి గెలుపు ఖాయమని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓటింగ్ పురస్కరించుకొని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కేంద్రంలో జడ్చర్ల నియోజకవర్గం ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్ల తో కలిసి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపు ఖాయం అన్నారు. ఎమ్మెల్యే వెంట ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు ఉన్నారు.
JCL: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపు ఖాయం: ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి..
RELATED ARTICLES