అనన్య న్యూస్, జడ్చర్ల: తెలంగాణకు హరితహారంలో జడ్చర్ల మున్సిపాలిటీ రాష్ట్ర ఉత్తమ అవార్డును అందుకుంది. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించిన పట్టణ ప్రగతి వేడుకలలో ఉత్తమ మున్సిపాలిటీలకు రాష్ట్ర అవార్డులను అందజేశారు. రాష్ట్ర ఉత్తమ హరిత జడ్చర్ల మున్సిపాలిటీ అవార్డును మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ల చేతుల మీదుగా జడ్చర్ల మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి, కమిషనర్ మహమూద్ షేక్ లు అందుకున్నారు.
ఈ సందర్భంగా చైర్ పర్సన్ లక్ష్మీ మాట్లాడుతూ తెలంగాణకు హరితహారంలో భాగంగా జడ్చర్ల మున్సిపాలిటీకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉత్తమ అవార్డును అందుకోవడంతో మాపై మరింత బాధ్యత పెరిగిందని, ఇదే స్పూర్తితో బాధ్యతతో పని చేస్తూ జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సహకారంతో మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో సిడిఎంఏ సత్యనారాయణ, జడ్చర్ల నాయకులు దోరేపల్లి రవీందర్ తదితరులు ఉన్నారు.