అనన్య న్యూస్, జడ్చర్ల: వైకుంఠ నాథుని కృపా కటాక్షాలతో ప్రజలంత సుభిక్షంగ ఉండాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి జడ్చర్ల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉత్తర ద్వారం గుండా వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా దేవాలయ సభ్యులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైకుంఠనాధుని కృపతో ప్రజలంతా సుఖంగా ఉండాలని, కరోనా లాంటి మహమ్మారులు ప్రబలకుండా ప్రాలాద్రోలాలని, ఆ దేవ దేవుని దీవెనలతో ప్రజలు సంతోషాలతో ఉండాలని అన్నారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు.
- ప్రజలు కుల, మత భేదాలు లేకుండా జీవించాలి:
జడ్చర్ల ఎంబి చర్చిలో మినీ క్రిస్మస్ వేడుకలు

సమాజంలో కులమత బేధాలు లేకుండా అందరూ కలిసికట్టుగా సమానంతో జీవించాలని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. క్రైస్తవుల పవిత్ర పండుగ క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని శనివారం జడ్చర్ల ఎంబి చర్చిలో నిర్వహించిన మినీ క్రిస్మస్ వేడుకలలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పేద క్రైస్తవులందరికీ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ కానుకగా అందిస్తున్న దుస్తులను పంపిణీ చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో కులమత బేధాలు లేకుండా అందరూ కలిసికట్టుగా సమానత్వంతో జీవించాలని, ఏసుక్రీస్తు దీవెనలు ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఎంబి చర్చ్ సభ్యులు ఎమ్మెల్యేని శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి, కౌన్సిలర్ కుమ్మరి రాజు, నాయకులు రబ్బాని, నిత్యానందం, బి. కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.