అనన్య న్యూస్, జడ్చర్ల: నీటి సంపులో పడి చిన్నారి మృతి చెందిన విషాదకర ఘటన ఆదివారం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేటకు చెందిన వినోద్ పుష్పలత దంపతుల కూతురు రెండున్నర సంవత్సరాల చిన్నారి రిహాన్సిక ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఇంటి ముందర ఉన్న నీటి సంపులో పడి మృతి చెందినట్లు తెలిపారు. ఒక్కగానొక్క కుమార్తె మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.