అనన్య న్యూస్, జడ్చర్ల: జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న జనంపల్లి అనిరుధ్ రెడ్డి నామినేషన్ వేశారు. సోమవారం నవాబ్ పేట మండలంలోని ఫతేపూర్ మైసమ్మ దేవతను దర్శించుకుని నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరి జడ్చర్ల తహసిల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ చాలా ఏళ్ల తర్వాత స్థానిక నాయకునిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేస్తున్నానని జడ్చర్ల నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు.
Jadcherla: నామినేషన్ వేసిన జడ్చర్ల కాంగ్రెస్ అభ్యర్థి అనిరుధ్ రెడ్డి..
RELATED ARTICLES