అనన్య న్యూస్, జడ్చర్ల: జడ్చర్ల అసెంబ్లీ స్థానానికి థర్డ్ జెండర్ అయిన మాత జానకమ్మ 2 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లలో భాగంగా శనివారం జడ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాష్ట్రీయ సామాన్య ప్రజా పార్టీ తరఫున బాలానగర్ మండలం పెద్దరేవల్లి గ్రామానికి చెందిన థర్డ్ జెండర్ మాత జానకమ్మ రెండు సెట్ల నామినేషన్ పత్రాలను జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, అదనపు కలెక్టర్ ఎస్. మోహన్ రావుకు అందజేశారు. అనంతరం జానకమ్మ మాట్లాడుతూ మా హక్కుల కోసం అసెంబ్లీలో పోరాడడానికి జడ్చర్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, ముఖ్యంగా థర్డ్ జెండర్ ల దుర్భర జీవితాలను బాగు చేసేందుకు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో పోరాటం చేస్తానని అన్నారు.
Jadcherla: తొలి నామినేషన్ దాఖలు చేసిన థర్డ్ జెండర్ మాత జానకమ్మ..
RELATED ARTICLES