అనన్య న్యూస్, జడ్చర్ల: జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జనంపల్లి అనిరుద్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాలలో పోటీ చేయనున్న అభ్యర్థులకు సంబంధించి 2వ జాబితాను శుక్రవారం విడుదల చేసిన జాబితాలో జడ్చర్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా జనంపల్లి అనిరుద్ రెడ్డి పేరు ఖరారు అయింది. గత కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న ఉత్కంఠకు నేటితో తెరపడింది. దీంతో జడ్చర్ల నియోజకవర్గంలో బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ల మధ్య పోటీ నెలకొననుందా లేక త్రిముఖ పోటీ ఉంటుందా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఇప్పటి నుంచి ఎవరి వ్యూహాలు ఏమిటో గెలిచేందుకు ఎవరు ఏం చేస్తారో ఓటర్లను ఎలా ప్రసన్నం చేసుకుంటారో, ఓటర్ల నిర్ణయం ఎలా ఉందో వేచి చూద్దాం.
Jadcherla: జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అనిరుద్ రెడ్డి..
RELATED ARTICLES