అనన్య న్యూస్, జడ్చర్ల: జడ్చర్ల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఆదివారం కౌటింగ్ లో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జనంపల్లి అనిరుద్ రెడ్డి గెలుపొందారు. కౌంటింగ్ పూర్తి అయిన అనంతరం 14630 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన జనంపల్లి అనిరుద్ రెడ్డికి జడ్చర్ల ఎమ్మెల్యేగా ఎన్నిక ధ్రువపత్రాన్ని జిల్లా కలెక్టర్ జి. రవినాయక్ అందజేశారు. ఈ సందర్భంగా అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో తనకు మద్దతునిచ్చి అండగా నిలిచి గెలిపించిన నియోజకవర్గ ఓటర్లకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. జడ్చర్ల నియోజకవర్గం అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.
Jadcherla: జడ్చర్ల ఎమ్మెల్యేగా గెలుపొందిన జనంపల్లి అనిరుద్ రెడ్డి..
RELATED ARTICLES