- ముస్లింలకు రూ.లక్ష ఆర్థిక సాయంపై ఎమ్మెల్యేకి సన్మానం.
అనన్య న్యూస్, జడ్చర్ల: రాష్ట్ర ఐటీ, పురపాలిక శాఖ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను సోమవారం జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులకు, కార్యకర్తలకు పంచి పెట్టారు.
క్రిస్టియన్, ముస్లింల ఆర్థికభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి.
తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలకు రూ. లక్ష రూపాయల ఆర్థిక సాయంపై జడ్చర్ల మైనార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలుపుతూ శాలువాతో ఘనంగా సన్మానించి, తమ ఆనందాన్ని పంచుకున్నారు. బీఆర్ఎస్ హయాంలోనే మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం జరిగిందని మైనార్టీ నాయకులు కార్యకర్తలు అన్నారు. కార్యక్రమాలలో జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ దొరేపల్లి లక్ష్మి, కౌన్సిలర్లు, మూడా డైరెక్టర్లు, నాయకులు ఇర్ఫాన్, మాలిక్ షాకిర్, షేక్ బాబా తదితరులు పాల్గొన్నారు.