అనన్య న్యూస్, జడ్చర్ల: కాంగ్రెస్ ది ప్రజా ప్రభుత్వ పాలన అని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని శుక్రవారం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇక నుంచి రాజకీయాలకతీతంగా ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలకు అందుబాటులో ఉంటూ క్యాంపు కార్యాలయంలో కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు.
నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, ప్రజల ఆశలకు ఆశయాలకు అనుగుణంగా సేవకుడిలా పని చేస్తానని పేర్కొన్నారు. ప్రజలు ఎవరైనా సమస్యలు పరిష్కారం కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి రావచ్చని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కోరే పార్టీ అని ప్రజల ముందుకు సంక్షేమాన్ని తీసుకెళ్లడమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని, దొరల పాలన నుంచి ప్రజలు విముక్తి పొంది ప్రజా పాలనను ఎంచుకున్నారని అన్నారు.