అనన్య న్యూస్, హైదరాబాద్:మహిళ బిల్లును ప్రవేశపెట్టింది.. రానున్న రోజుల్లో తీసుకువచ్చేది బిజెపినే అని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ స్పష్టం చేశారు. గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసింది. ఎనిమిది మంది గవర్నర్ లను చేసిన ఘనత బిజెపిదే..అన్నారు. కీలకమైన ఆర్థిక శాఖ, రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల శాఖను మహిళలకు ఇచ్చిన ఘనత మోడీ ది అన్నారు. మంగళవారం నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ బిఆర్‌ఎస్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. కేవలం మహిళలకు 7 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన కెసిఆర్ దీనికి సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో కనీసం మహిళల రక్షణ లేకుండా పోయిందన్నారు.
రాష్ట్ర ప్రజలు బిజెపికి మద్దతును పలుకుతున్నారని వెల్లడించారు. చాలా మంది ఎమ్మెల్యేలపై ఆరోపణలు వచ్చాయి. ముదిరాజ్ లకు అసలు ఒక్క టిక్కెట్ కూడా ఇవ్వలేదన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటూ పోరాడుతున్న ఎమ్మెల్సీ కవిత బిఆర్‌ఎస్‌లో మహిళలకు 3 శాతం సీట్లే కల్పించడాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. రాజకీయాల్లోకి రావాలని ఆశ ఉన్న అధికారులకు రాజకీయ ఆకాంక్ష ఉంటే పదవులకు రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావాలని హితవు పలికారు.