అనన్య న్యూస్, హైదరాబాద్: సీఎం కేసీఆర్ దంపతులు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఆదివారం పట్టువస్త్రాలు, బోనం సమర్పించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్నసీఎం కేసీఆర్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆయనతోపాటు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అంతకుముందు ఎమ్మెల్సీ కవిత మహాకాళి అమ్మవారిని దర్శించుకొని బంగారు బోనం సమర్పించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు. మంత్రి మల్లారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
Hyd: మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించిన సీఎం కెసిఆర్..
RELATED ARTICLES