అనన్య న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు మార్పుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. బుధవారం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై కిషన్ రెడ్డి స్పందించారు. రాష్ట్ర అధ్యక్షుని మార్పుపై అధిష్టానం ఆలోచనే లేదన్నారు. ప్రస్తుతం తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ని మార్చి కొత్త వారిని నియమించే అవకాశం లేదన్నారు. కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇలా ఎందుకు సృష్టిస్తున్నారో తెలియదన్నారు. దీనిపై కార్యకర్తల్లో ఎలాంటి గందరగోళం లేదని తెలిపారు.
రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు మార్పు వార్తలను రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుంగ్ ఖండించారు. ఇవన్నీ కేవలం ఊహాగానాలు అని తేల్చి చెప్పారు. ప్రస్తుతం అధ్యక్షునిగా ఉన్న బండి సంజయ్ యధావిధిగా కంటిన్యూ అవుతారని స్పష్టం చేశారు.