అనన్య న్యూస్, హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప మందు ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేప ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చేప ప్రసాద పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసిందని తెలిపారు.
175 ఏళ్ళ నుంచి బత్తిని కుటుంబ సభ్యులు ఆస్తమా భాదితులకు చేప మందు ప్రసాదం పంపిణీ చేస్తున్నారన్నారు. రేపు ఉదయం 8 గంటల వరకు 24 గంటల పాటు చేప ప్రసాద పంపిణీ జరుగుతుందన్నారు. చేప ప్రసాదం పంపిణీ కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో దాదాపు 32 క్యూలైన్లను ఏర్పాటు చేశామని, చిన్నపిల్లలకు, వృద్ధులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.