అనన్య న్యూస్, హైదరాబాద్: బ్రిటీషోళ్లకు వ్యతిరేకంగా పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అల్లూరి ఆశయాలను అందరూ ఆచరించాలని, ఆయన లాంటి మహనీయుల చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు ఉత్స వాలు నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్రపతి ఈ సందర్భంగా ఏపీలోని భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి స్మృతివనం, 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని వర్చువల్ గా ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం, దేశ భక్తి అసమానమైనవి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోరాటం తరహాలోనే అల్లూరి పోరాటం కూడా ప్రజల్లో ఎంతో స్ఫూర్తిని రగిల్చింది. అల్లూరి ఒక ప్రత్యేకమైన యుద్ధ నైపుణ్యంతో బ్రిటీషోళ్లను ఎదుర్కొన్నారు. ఈ వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు.
అల్లూరి భరతమాత ముద్దు బిడ్డ అని గవర్నర్ తమిళసై కొనియాడారు. అల్లూరి లాంటి స్వా తంత్ర్య సమరయోధులను తలచుకున్నప్పుడు ప్ర జాస్వామ్యం గొప్పదనం తెలుస్తుందని చెప్పారు. అమాయక ఆదివాసీలను దోచుకుంటూ, వారి అటవీ ఉత్పుత్తులపై పన్నులు వేయడంతో బ్రిటి షోళ్ల పై అల్లూరి పోరాటం చేశారు. ఆదివాసీలను చైతన్యవంతులను చేసి సంఘటితం చేశారని తెలిపారు. అల్లూరి జీవితం అందరికీ స్ఫూర్తి దాయకమని, అలాంటి మహనీయుడి జయంతి వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గిరిజనుల అభివృ ద్ధికి ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వా లను అభినందించారు. అనంతరం గవర్నర్ తెలుగులో బాగా మాట్లాడారంటూ సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు.
గొప్ప వ్యక్తులను స్మరించుకోవడం ద్వారానే చరిత్రకు సరైన గుర్తింపు లభిస్తుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. కొందరు చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలిస్తే, మరికొందరు సరికొత్త చరిత్రను ఆవిష్కరిస్తార ని.. అలాంటి వారిలో అల్లూరి ఒకరని కొనియా “అల్లూరి ఒక ప్రాంతానికి వర్గానికి పరి మితమైన వ్యక్తి కాదు. గత ప్రభుత్వాలు అల్లూరిని విస్మరించాయి. అల్లూరి చరిత్రకు సంబంధించిన ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దు తం. ఇందుకోసం క్షత్రియ సేవా సమితితో కలిసి పనిచేస్తం” అని చెప్పారు. ఒక్క అల్లూరి సీతారా మరాజు మరణిస్తే వేలకొద్దీ సీతారామరాజులు వస్తారని స్ఫూర్తి రగిలించిన గొప్ప వీరుడు అల్లూరి అని కొనియాడారు. అల్లూరి వీరుడు మాత్రమే కాదు.. వైద్యుడు, ఆధ్యాత్మిక వేత్త కూడా అని పేర్కొన్నారు.