జడ్చర్ల, అనన్య న్యూస్: దేశ రాజకీయాల్లో భవిష్యత్తులో బిజెపి పార్టీకి ప్రత్యామ్నాయం బిఆర్ఎస్ పార్టీ అని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సీఎం కెసిఆర్ పై కక్షపూర్వకంగానే కేంద్ర ప్రభుత్వం ఎమ్మెల్సీ కవితను కేసుల పేర వేధిస్తున్నారని, దేశంలో సీఎం కేసీఆర్ ని కట్టడి చేయాలనే వేధింపులకు గురి చేస్తున్నారని, లక్షల కోట్ల స్కాములు చేసిన ఆదాని గురించి కేంద్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదన్నారు. బిజెపి ప్రభుత్వం జాతీయం పేరుతో దేశాన్ని సర్వనాశనం చేస్తుందని, టార్గెట్ పెట్టి వేధింపులు చేయడం తగదని అన్నారు. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ వాక్యాలు సరికాదని వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, జడ్చర్ల మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మి, సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రనిల్ చందర్, ముడార్ డైరెక్టర్ శ్రీకాంత్, నాయకులు రామ్మోహన్ తదితరులు ఉన్నారు.
దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం బిఆర్ఎస్ పార్టీ.. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
RELATED ARTICLES