Friday, March 21, 2025

ఒడిస్సా రైలు బాధితులకు రూ.10కోట్ల విరాళం.. జైలు నుంచి లేక పంపిన సుఖేష్..

అనన్య న్యూస్: మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆర్థిక మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ రైల్వే శాఖకు ఓ లేఖ పంపాడు. ఇటీవల ఒడిశాలో చోటుచేసుకున్న ఘోర రైలు దుర్ఘటనలో బాధిత కుటుంబాలకు రూ.10కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు సుకేశ్ ముందుకొచ్చాడు. ఆ విరాళాన్ని అంగీకరించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవు కోరాడు. ప్రస్తుతం తిహాడ్ జైలులో ఉన్న సుకేశ్.. అక్కడి నుంచే ఈ లేఖ పంపినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

చట్టబద్ధమైన మార్గాల్లో సంపాదించిన సొమ్ములో నుంచే ఈ డబ్బును పంపిస్తున్నట్లు అతడు ఈ లేఖలో తెలిపాడు. ఇందుకు తాను ఆదాయపు పన్ను కూడా చెల్లించినట్లు పేర్కొన్నాడు. ఈ విరాళాన్ని స్వీకరించాలని రైల్వే మంత్రిని సుకేశ్ అభ్యర్థించాడు. విరాళాన్ని పంపేందుకు సంబంధిత విభాగ వివరాలను పంపాలని కోరాడు. తక్షణమే డిమాండ్ డ్రాఫ్టు తయారుచేసి రూ.10కోట్ల విరాళాన్ని పంపిస్తానని తెలిపాడు. ఆ డబ్బుకు సంబంధించిన పత్రాలు, రిటర్నుల వివరాలను కూడా డీడీతో పాటు అందజేస్తానని చెప్పాడు.

ఒడిశా రైలు దుర్ఘటన దురదృష్టకరం. ఆ ఘటన నన్ను ఎంతగానో బాధించింది. ఈ ప్రమాదంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలుసు. కానీ ఓ బాధ్యతాయుతమైన, ఉత్తమ పౌరుడిగా బాధిత కుటుంబాలకు నా వంతుగా రూ.10కోట్ల సహకారం అందిస్తున్నా. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల చదువులు, పెద్దదిక్కును పోగొట్టుకున్న కుటుంబాలను ఆదుకోవడానికి ఈ మొత్తం ఉపయోగపడుతుంది” అని సుకేశ్ ఆ లేఖలో రాశాడు.

Ananya News
Ananya Newshttps://ananyanews.in
Ananya News is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular