జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్
జడ్చర్ల, అనన్య న్యూస్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ను పకడ్బందీగా నిర్వహించాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ తెలిపారు. ఈనెల 13వ తేదీన సోమవారం జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఆదివారం ఆయన జడ్చర్ల బి.ఆర్.ఆర్ డిగ్రీ కళాశాల, మిడ్జిల్ మండల కేంద్రంలోని యూపీఎస్ లలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన పోలింగ్ కేంద్రాలలో ఏర్పాటు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సమయంలో ఎలాంటి పొరపాట్లు జరుగకుండ ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతులు,ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. జడ్చర్ల తహసీల్దార్ లక్ష్మీనారాయణ, మిడ్జిల్ తహసీల్దార్ రాజీవ్ రెడ్డి లు ఉన్నారు.