అనన్య న్యూస్, జడ్చర్ల: అర్హులకే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయిస్తామని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని 16, 17 వ వార్డులలో అర్హులైన లబ్ధిదారుల ఎంపికలో భాగంగా ఇంటింటికి వెళ్లి పేద ప్రజలు నివాసం ఉంటున్న ఇండ్లను, శిథిలావస్థకు చేరిన ఇండ్లను పరిశీలించారు. ఇంటి స్థలాలు ఉన్నవారికి రూ.3 లక్షలు కేటాయిస్తామని తెలిపారు. ఇండ్ల కేటాయింపు పారదర్శకంగా ఉండేందుకు స్వయంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. వచ్చే నెలలో ఇళ్ల పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో తహసిల్దార్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి, కమిషనర్ మహమూద్ షేక్, కౌన్సిలర్ లలిత, చైతన్య గౌడ్, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అర్హులకే డబల్ బెడ్ రూమ్ ఇండ్లు: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
RELATED ARTICLES