- తండాలను పంచాయతీలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ దే.
- పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా కల్యాణలక్ష్మీ
అనన్య న్యూస్, జడ్చర్ల, బాలానగర్: తెలంగాణ వచ్చాకే తండాలు అభివృద్ధి చెందాయని, తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దే అని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. సోమవారం బాలానగర్ మండలంలోని ఊటుకుంట తండా గ్రామపంచాయతీ నూతన భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వరాష్ట్రంలో గిరిజనులకు సర్పంచులుగా అవకాశం రావడంతో తండాలు సైతం స్వయంపాలన దిశగా అడుగులు వేస్తున్నాయన్నారు. నేడు తండాలకు ఏం కావాలో ఆనిర్ణయం తీసుకునే అధికారం గిరిజనులకే దక్కిందన్నారు. తండాలను, మారుమూల గూడెం లను పంచాయతీలుగా మార్చడంతో పాలన మరింత చేరువైందని, పారిశుద్ధ్యం సైతం మెరుగైందన్నారు. గిరిజనులకు అధికారం కట్టబెట్టిన ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు.
పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా కల్యాణలక్ష్మీ:
తెలంగాణ లో అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాధిముబరాక్ పథకాలు పేదింటి ఆడబిడ్డల తల్లిదండ్రుల్లో కొండంత భరోసా నింపాయని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సోమవారం బాలనగర్ మండల పరిధిలో (86) మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మీ, షాధి ముబారక్ పథకాలు దేశనికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి రూ. లక్షా 116 అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కుల,మత, వర్గ, పార్టీ, ప్రాంతీయ భేదాలు లేకుండా నిరుపేదలకు పథకం వర్తింప చేస్తున్నట్లు గుర్తు చేశారు. పనిచేసే ప్రభుత్వన్నీ ప్రజలు గుర్తించాలని, ప్రభుత్వానికి అండగా నిలవాలని అన్నారు.