రహదారి పక్కన గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం..
అనన్య న్యూస్: జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ దగ్గర 167వ జాతీయ రహదారి మహబూబ్ నగర్ రోడ్డు పక్కన గుర్తుతెలియని మహిళ (40) మృతదేహం శనివారం ఉదయం లభ్యమయింది. మృతురాలి ఒంటిపై గాయాలు ఉండడంతో ముక్కు, చెవుల నుండి రక్తం కారుతుండడంతో మహిళ మృతి పై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రమాదవశాత్తు చనిపోయిందా లేక ఎవరైనా హత్య చేసి ఇక్కడ పడేశారా అన్నఅనుమానాలు కలుగుతున్నాయి. మహిళా సేవం పడి ఉన్న విషయం తెలుసుకున్న జడ్చర్ల పట్టణ సీఐ రమేష్ బాబు, ఎస్సై లెనిన్ గౌడ్ తో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిసరాలను పరిశీలించి, మృతురాలి వివరాలు సేకరిస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాదేపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మహిళ మృతదేహం లభ్యమైన పరిసరాలను, సిసి ఫుటేజ్ లను పరిశీలించిన కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.