అనన్య న్యూస్, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్, విశాఖపట్నం ఎక్స్ప్రెస్ (12862) రైలును కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. శనివారం మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందాలన్న రోడ్డు, రైలు, ఎయిర్ కనెక్టివిటీ ఉండాలన్నారు. వెనుకబడిన పాలమూరు జిల్లా అభివృద్ధి చెందాలంటే కనెక్టివిటీ అవసరమన్నారు. త్వరలో ఈ ప్రాంతానికి అనుసంధానిస్తూ జాతీయ రహదారులు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌ను షాద్‌నగర్‌లో ఆపాలని స్థానికులు కోరారని ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే జీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.
మహబూబ్ నగర్, విశాఖ రైలును ప్రారంభించిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు..
RELATED ARTICLES