- జూన్ 8న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఇండ్ల పంపిణీ
అనన్య న్యూస్, జడ్చర్ల: పేదల సొంతింటి కలను సహకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించిందని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ఎర్రగుట్ట వద్ద పేదల సొంతింటి కలను నిజం చేస్తూ నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను బుధవారం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సందర్శించి, తుది మెరుగులు అందుకుంటున్న ఇండ్ల పనులపై అధికారులకు, గుత్తేదారులకు పలు సూచనలు సలహాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ జూన్ 8న డబుల్ బెడ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హాజరై పంపిణీ చేస్తారని, గూడు లేని ప్రతినిరుపేదకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు దోరేపల్లి రవీందర్, నాగిరెడ్డి, ఏఎంసి వైస్ చైర్మన్ దానిష్ తదితరులు పాల్గొన్నారు.
గౌస్ పార్థివ దేహం వద్ద ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నివాళి.

జడ్చర్ల మున్సిపాలిటీ పరిధి నిమ్మబావిగడ్డ కు చెందిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్త, ఫోటోగ్రాఫర్ మహమూద్ గౌస్ గత రాత్రి అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి బుధవారం వారి నివాసానికి చేరుకొని గౌస్ పార్థివ దేహం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గౌస్ కుటుంబానికి అండగా ఉంటామని, వారిని ఆదుకుంటామని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.