అనన్య న్యూస్: చిన్న పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వొద్దని పలువురు మానసిక నిపుణులు, వైద్యులు చెప్పడం విన్నాము. కానీ సాక్షాత్తు ఓ స్మార్ట్ ఫోన్ కంపెనీ మాజీ సీఈవోనే తల్లి దండ్రులను పిల్లలకు పోన్లు ఇవ్వొ ద్దని కోరుతున్నారు. చిన్న వయసులోనే స్మార్ట్ ఫోన్ లు ఇస్తే అది వారి మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని అంటున్నారు. అందువల్ల స్మార్ట్ ఫోన్ల విషయలో తల్లి దండ్రులను జాగ్రత్త వహించమని సూచిస్తున్నారు ప్రముఖ షియోమీ ఇండియా కంపెనీ మాజీ సీఈవో మను కుమార్ జైన్.
స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు పిల్లల మానసిక ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్ర భావం చూపుతాయో వివరించారు. ఈ మేరకు ఆయన దీనికి సంబంధించి యూఎస్ కు చెందిన ప్రముఖ లాభప్రేక్షలేని సంస్థ సపియన్ ల్యాబ్ అధ్యయనం చేసిందని తెలిపారు. ఆ ల్యాబ్ నుంచి ఒక స్నేహితుడు అందుకు సంబంధించిన విషయాలను తనతో షేర్ చేసుకున్నట్లు లింక్డ్ఇన్ లో వెల్లడించారు. చిన్నప్పుడే స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడే చిన్నారులు పెద్దయ్యాక మానసిక ఆరోగ్య రుగ్మతలతో బాధపడే అవకాశం ఉందని పేర్కొన్నట్లు తెలిపారు.
ఆ అధ్యయన ప్రకారం పదేళ్ల వయసులో స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడితే పెద్దయ్యాక మహళలైతే 60-70 శాతం మంది దాక మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారని, అదే పురుషులైతే 45-50 శాతం మంది దాక ఈ సమస్యలను ఎదుర్కొన్నట్లు నివేదిక వెల్లడిం చిందని మను కుమార్ జైన్ వెల్లడించారు. పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తల్లి దండ్రులపై ఉంది కావున దయచేసి వారిని వేరే క్రీడలలో నిమగ్నమయ్యేలా చూడలని తల్లి దండ్రులకు విజ్ఞిప్తి చేశారు.
పిల్లలను చదువు లేదా వారి అభిరుచికి సంబంధించిన వాటిల్లో ప్రోత్సహిస్తే గనుక మనం వారికి ఆరోగ్య కరమైన సమతుల్య వాతావరణాన్ని అందించ గలిగిన వారమవుతామని సూచించారు. చిన్న వయసులోనే ఎక్కువ సమయం ఫోన్ లేదా ట్యాబ్ లతో గడిపితే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఏర్పడి పలు దుష్పరిణామాలకు దారితీసే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు.
బాల్యం చాల విలువైనదని, ఆ సమయాన్ని వారి వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే అంశాల్లో కేంద్రీకరించేలా చేసి వారి భవిష్యత్తుకు మంచి పునాదిని ఏర్పరుచుకనేలా ప్రోత్సహించాల్సిన భాద్యత మనమిదే ఉందని అన్నారు. అదే సమయంలో తాను స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లకు వ్యతిరేకిని కాదని, ఐతే చిన్న పిల్లలను మాత్రం స్మార్ట్ ఫోన్లకు, ట్యాబ్ లకు సాధ్య మైనంత దూరంగా ఉంచేలా జాగ్రత్త వహించాలని తల్లి దండ్రులని కోరుతున్నట్లు తెలిపారు.