అనన్య న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం రేపిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో పెద్దల హస్తం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. దీనిపై న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ ఆందోళనలో అరెస్టైన బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ తో సహా అరెస్ట్ అయిన బీజేవైఎం నేతలను ఆదివారం చంచల్ గూడ జైలుకు వెళ్లి పరామర్శించారు. ప్రశ్నాపత్రం లీక్ అవడం దుర్మార్గం. ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వడంతో నిరుద్యోగులు ఆవేదనకు గురి అవుతున్నారు. తెలంగాణ యువత ఆక్రోశంతో ఉంది. ప్రశ్నాపత్రం లీకేజీలో పెద్దల హస్తం ఉందని ప్రచారం జరుగుతోంది. కాబట్టి దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరపాలి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా బీజేపీ పని చేస్తుందన్నారు. బీజేపీ పార్టీకి జైళ్లు కొత్త కాదని, అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని, తెలంగాణలో మార్పు తీసుకవచ్చే వరకు పోరాటం చేస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
న్యాయమూర్తితో విచారణ జరిపించాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
RELATED ARTICLES