అనన్య న్యూస్: నిర్మల్ జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదివారం ప్రారంభించారు. మొదట కలెక్టరేట్ శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం చాంబర్‌లో కలెక్టర్ సీటులో వరుణ్ రెడ్డిని కూర్చండబెట్టి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు కలెక్టరేట్ వద్ద పోలీస్ సిబ్బంది ముఖ్యమంత్రికి గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, బాల్క సుమన్, జీవన్‌రెడ్డి, రేఖా నాయక్, నడిపెల్లి దివాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్..
RELATED ARTICLES