Monday, March 10, 2025

నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రి ఘటనపై విచారణకు ఆదేశాలు: మంత్రి హరీశ్‌ రావు

అనన్య న్యూస్: నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి సంబంధించి ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన ఓ రోగిని అతని సహాయకులు రెండు కాళ్లు పట్టుకుని లాక్కెళ్తున్నట్లుగా ఉన్న ఆ దృశ్యాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే రోగి రెండు కాళ్లు పట్టుకుని లాక్కెళ్లాల్సి వచ్చిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు స్పందించారు. ఈ ఘటనపై నిజానిజాలు తెలిసేలా విచారణ జరిపి, తక్షణమే నివేదిక అందజేయాలని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ను ఆదేశించారు.

Ananya News
Ananya Newshttps://ananyanews.in
Ananya News is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular