అనన్య న్యూస్, హైదరాబాద్: తిండి లేకున్నా ఉండవచ్చు కానీ ఆత్మ గౌరవం లేని చోట ఉండలేమని మాజీ మంత్రి జూపల్లి అన్నారు. సోమవారం బీఆర్‌ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఆనందంగా ఉందని, పంజరం నుంచి విడుదలైనట్లు ఉందన్నారు. మూడున్నర సంవత్సరాల ముందు తన పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నానని, సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు తెలంగాణ మంత్రులు పదవి లేకుండా ఉండలేరని విమర్శిస్తే రాజీనామా చేశానని గుర్తు చేశారు. 2011లో రాజీనామా చేసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పాదయాత్ర చేసి గెలిచానన్నారు. 2018 లో టిఆర్ఎస్ ను 13 స్థానాల్లో గెలిపించానన్నారు. అంబేద్కర్ స్పూర్తికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
తిండి లేకున్నా ఉండవచ్చు కానీ.. ఆత్మ గౌరవం లేని చోట ఉండలేము: జూపల్లి
RELATED ARTICLES