అనన్య న్యూస్: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని దివిటిపల్లిలో నూతనంగా నిర్మించిన ఐటీ టవర్ను శనివారం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం పరిశీలించారు. దివిటిపల్లిలో నాలుగు ఎకరాల్లో ఐదు అంతస్తుల్లో రూ. 40 కోట్ల వ్యయంతో ఈ ఐటీ టవర్ను నిర్మించారు. ఇప్పటికే ఈ ఐటీ టవర్లో పలు కంపెనీలు తమ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాయి. శనివారం మంత్రి కేటీఆర్ ఐటీ టవర్ను ప్రారంభించగానే ఆయా కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి.