అనన్య న్యూస్, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. సోమవారం ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా గుట్టకు వచ్చిన ముఖ్యమంత్రికి ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బ్రహ్మోత్సవాల తొలిరోజున సతీ సమేతంగా యాదాద్రీశుడికి సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. పూజల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దంపతులకు ఆలయ పండితులు వేదాశీర్వచనం అందించారు. స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందచేశారు.
సీఎంతో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు బీర్ల అయిలయ్య, వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్ ఉన్నారు. యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి 11 రోజులపాటు జరుగనున్నాయి.