- మళ్లీ గెలిచేది బీఆర్ఎస్ సే, కేసీఆర్ ఏ మళ్లీ ముఖ్యమంత్రి..
అనన్య న్యూస్, వనపర్తి: వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి వద్ద నిర్మించనున్న ప్రియునిక్ ఆయిల్ ఆయిల్ ఫ్యాక్టరీకి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఒకప్పుడు కృష్ణా నది పాలమూరు గుండా ప్రవహిస్తున్న పాలమూరుకు మాత్రం తాగడానికి నీరు ఉండేది కాదని అలాంటిదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కృష్ణమ్మ నీటిని ఓడిసి పట్టుకొని పాలమూరు బీడు భూములను సస్యశ్యామలం చేశామని, వరి వరి ధాన్యం ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంటూ, రాష్ట్రంలో పండిన ధాన్యం కొనమంటే కేంద్రం కొర్రీలు పెడుతున్నదని విమర్శించారు. వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించారు.
దేశంలో పప్పు ధాన్యాలు వంటనూనె కొరత ఎంతో ఉందన్నారు. దేశానికి 75 శాతం పప్పు ధాన్యాలు, వంట నూనెలు బయటి దేశాల నుండి దిగుమతి చేసుకోవడం జరుగుతుందని దీనిని గమనించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ముందు చూపుతో రాష్ట్రంలో పామాయిల్ సాగుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని గుర్తించి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ఒకప్పుడు 30వేల ఎకరాల్లో ఉన్న పామాయిల్ సాగును రాష్ట్రంలో 20లక్షలకు పై చిలుకు సాగు దిశగా దూసుకుపోతోంది అన్నారు. ఎంతో ముందుచూపు ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి పామాయిల్ పంటను ఎవరు కొంటారు అనే సంశయం లేకుండా ముందుగానే ఆయిల్ కంపెనీలతో మాట్లాడి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో 34 పామాయిల్ ఫ్యాక్టరీ లు నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
పామాయిల్ సాగు 4 సంవత్సరాల్లో పంట చేతికి వస్తుందని, ఆ లోపు రైతు నష్టపోకుండా ఎకరానికి 50918 రూపాయలు సంవత్సరానికి రైతుకు రాయితిగా అందించడం జరుగుతుంది. దీనికొరకు రూ. 2500 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది. ఈ నాలుగు సంవత్సరాలు పంట చేతికి వచ్చే వరకు ఎదైన అంతర పంట వేసుకోవచ్చని అన్నారు. 4 సంవత్సరాల తర్వాత సంవత్సరానికి 12000 రూపాయల ఆదాయం 35 సంవత్సరాల పాటు పెన్షన్ వచ్చినట్లు వస్తుందని తెలియజేశారు. వ్యవసాయ శాఖ మంత్రి మీ జిల్లా వాసి అయినందున వ్యవసాయ రంగానికి సంబంధించి అన్ని రకాల సహకారం అందుతుందని అన్నారు. మళ్లీ గెలిచేది బీఆర్‌ఎసేనని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
పంటల మార్పిడికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్: మంత్రి నిరంజన్ రెడ్డి..
సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని బలోపేతం చేశారని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పంటల మార్పిడికి శ్రీకారం చుట్టారని తెలిపారు. దేశంలో 22 వేల మిలియన్ టన్నుల నూనె అవసరమన్నారు. అందులో 15 వేల మిలియన్ టన్నుల నూనెను దిగుమతి చేసకుంటున్నామని వెల్లడించారు. ఆయిల్ పామ్ సాగుతో రైతులకు ఎంతో మేలు జరుగుతున్నదని పేర్కొన్నారు. లక్షా 25 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగవుతున్నదని చెప్పారు. ఒక్క వనపర్తి జిల్లాలో 5 వేల ఎకరాల్లో పంట సాగవుతున్నదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు రాములు, మన్నె శ్రీనివాస్ రెడ్డి, జిల్లా జడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి, గిడ్డంగుల శాఖ చైర్మన్ రజిని, గిరిజన కార్పొరేషన్ ఛైర్మన్ వాల్య నాయక్, జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్, జిల్లా ఎస్పీ రక్షిత కృష్ణ మూర్తి, ఎంపిపి లు, జడ్పీటీసీ లు, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.