అనన్య న్యూస్, వికారాబాద్: స్కూలు బస్సుకు పెను ప్రమాదం తప్పింది. శనివారం వికారాబాద్ జిల్లా సుల్తాన్ పూర్ లో ఓ ప్రైవేటు స్కూల్ కు చెందిన బస్సు అదుపుతప్పి ఓ కుంటలోకి దూసుకెళ్లింది. కాగా స్థానికులు కాపాడటంతో ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది విద్యార్థులు ఉన్నారు. స్టీరింగ్ పనిచేయక పోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. బస్సు మరికొంత లోపలికి వెళ్తే పెను విషాదమే జరిగేదని స్థానికులు చెబుతున్నారు. బస్సు ఒక్కసారిగా కుంటలోకి దూసుకెళ్లడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు.