Tuesday, March 18, 2025

VANDE BHARATH: 6 నుంచి జడ్చర్ల మీదుగా వందేభారత్ రైలు..

అనన్య న్యూస్, జడ్చర్ల: భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఇక జడ్చర్ల మీదుగా వెళ్లనుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు మార్గాల్లో వందేభారత్ రైళ్లను ప్రారంభించింది. కాచిగూడ నుంచి యశ్వంత్ పూర్ మధ్య ప్రయాణికులను చేరవేసేందుకు ఈ నెల 6వ తేదీ నుంచి వందేభారత్ రైలు పట్టాలెక్కనుంది. ఈ మార్గంలో నడిచే తొలి వందే భారత్ రైలు ఇదే కావడం విశేషం.

ప్రతి రోజు ఈ రైలు కాచిగూడ నుంచి బయలుదేరి షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల రైల్వే స్టేషన్ లలో ఆగనుంది. తిరుగు ప్రయాణంలోనూ ఉమ్మడి జిల్లాలోని ఈ స్టేషన్ లలోనే హాల్టు ఇచ్చారు. ఈ రైలును 6వ తేదీన కాచిగూడలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్లో ఈ రైలును ప్రారంభించే అవకాశం ఉందని రైల్వే శాఖ అధికారుల సమాచారం.

Ananya News
Ananya Newshttps://ananyanews.in
Ananya News is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular