అనన్య న్యూస్, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్‌గా జిష్ణు దేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం తర్వాత జిష్ణు దేవ్ వర్మకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పగుచ్ఛం అందించి కంగ్రాట్స్ చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.
Telangana: తెలంగాణ గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మ ప్రమాణ స్వీకారం..
RELATED ARTICLES