అనన్య న్యూస్, రాజాపూర్: మండల పరిధిలో ఉన్న అన్ని ఫ్యాక్టరీలను తొందరలోనే సందర్శించి అధిక పొల్యూషన్ ఉన్న ఫ్యాక్టరీల పైన చర్యలు తీసుకుంటామని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో శుక్రవారం ముఖ్య అతిధిగా జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు. ఎంపిపి సుశీల అధ్యక్షతన ప్రారంభమైన సమావేశంలో ఎక్కువగా జరిగిపోయిన, సర్వసభ్య సమావేశంలో చర్చించిన సమస్యలే మళ్లీ ప్రస్తావించగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈరోజు వచ్చిన సమస్యలు మూడు నెలల్లో పూర్తి చేస్తారా, లేదా అనేది అధికారులు వివరణ ఇచ్చిన తరువాతనే మరో సమావేశం మొదలవుతుందని అన్నారు.
రాయపల్లి, రంగారెడ్డిగూడ తదితర సర్పంచులు విద్యుత్ సమస్యలు చాలా రోజులుగా ఉందని తెలుపగా బడ్జెట్ సమస్య అని అధికారులు తెలిపారు. అలాగే మిషన్ భగీరథ ట్యాంకుల నిర్మాణం గురించి అడుగగా బడ్జెట్ సమస్య, అంగన్ వాడి భవనాల నిర్మాణం స్థలలా సమస్య, బడ్జెట్ సమస్యలపై సమావేశం కొనసాగింది. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ ఇరిగేషన్ అధికారులకు రాజాపూర్ మండలంలోని అన్ని చెరువులు సర్వే చేసి, ఎఫ్టీఎల్ విస్తీర్ణం గుర్తించి హద్దులు ఏర్పాటు చేయాలని, చెరువు శికం భూములు ఎంత వరకు ఉన్నాయో పూర్తి రికార్డు తయరు చేయాలని, ఉదండాపూర్ రిజర్వాయర్ కు మండలంలోని ఎన్ని చెరువుల నుండి మట్టిని తరలించారో, వారి మైనింగ్ అనుమతులు, ఎన్ని ఫీట్ల వరకు తవ్వాలని అనుమతులు ఉన్నాయో వాటి వివరాలు, మట్టి కాంటాక్టర్ల వివరాలు మూడు నెలల్లో తయరు చేయాలని తెలిపారు.
అందరూ సర్పంచులు, ఎంపీటీసీలు మండల అభివృద్ధికి సహకరించి సమస్యలు పరిష్కారం చేసుకోవాలని సూచించారు. సర్వసభ్య సమావేశానికి రాని అధికారులకు నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాజాపూర్ మండల పరిధిలో ఉన్న పలు కంపెనీలను త్వరలోనే సందర్శించి అధిక పొల్యూషన్ ఉన్న ఫ్యాక్టరీల పైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మహిపాల్ రెడ్డి, తహసీల్దార్ విజయబాస్కర్ రెడ్డి, ఎంపీడీఓ లక్ష్మీదేవి, సర్పంచులు, ఎంపీటీసీలు, సంబందిత శాఖల అధికారులు పాల్గొన్నారు.