అనన్య న్యూస్: భారత ప్రధాని నరేంద్ర మోడీ భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ గ్యాల్ఫో ను అందుకున్నారు. శుక్రవారం భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యేల్ వాంగ్ చుక్ అందజేశారు. దీంతో ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి విదేశీ ప్రభుత్వాది నేతగా మోదీ నిలిచారు. ఈ అవార్డును మోడీకి 2021 లోనే ప్రకటించారు. ఇరుదేశాల సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు కోవిడ్ సమయంలో 5 లక్షల టీకాలను అందజేయడం వంటి చర్యలకు గుర్తింపుగా అవార్డును అందజేశారు. ఈ అవార్డు అందుకోవడం గౌరవంగా ఉందని దీన్ని 140 కోట్ల మంది భారతీయులకు అంకితమిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.
PM Modi: ప్రధాని మోడీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం..
RELATED ARTICLES