అనన్య న్యూస్, జడ్చర్ల: సమాజంలో పేదరికంతో అలమటిస్తున్న ప్రజల హక్కుల కోసం పోరాడిన బహుజన వీరుడు పండుగ సాయన్న జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకమని కావేరమ్మపేట ముదిరాజ్ సంఘం సభ్యులు అన్నారు. తెలంగాణ పోరాటయోధుడు పండుగ సాయన్న జయంతి ఉత్సవాలలో భాగంగా సోమవారం కావేరమ్మపేట బొడ్రాయి చౌరస్తాలో జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయన్న చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాటి నిరంకుశ నిజాం నవాబులను ఎదిరించి తన సొంత పాలన వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఒక సరికొత్త బహుజన రాజ్యాన్ని స్థాపించిన మహనీయుడు, పెత్తందారుల, దొరల ఆధిపత్యానికి అడ్డుగా నిలిచి ఆకలితో అలమటించే ప్రజల కోసం పోరాడి సాయం చేసిన బహుజన వీరుడు పండుగ సాయన్న అని, అలాంటి వీరుని ఖ్యాతిని మరింతగా పెంచే బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ సభ్యులు, సాయన్న అభిమానులు, గ్రామ ప్రజలు, ముదిరాజ్ కుల బంధువులు తదితరులు పాల్గొన్నారు.
Panduga Sayanna: పండుగ సాయన్న జీవితం స్ఫూర్తిదాయకం: కావేరమ్మపేట ముదిరాజ్ సంఘం..
RELATED ARTICLES