అనన్య న్యూస్, ఢిల్లీ: ఆధార్ తో అనుసంధానం చేయని 11.5 కోట్ల పాన్ కార్డులు డీయాక్టివేట్ అయ్యాయి. ఇచ్చిన గడువు ఈ ఏడాది జూన్ 30తో ముగియడంతో కార్డులు డీయాక్టివేట్ చేస్తున్నట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 70.24 కోట్ల పాన్ కార్డు హోల్డర్లు ఉండగా అందులో 57.25 కోట్ల మంది ఆధార్ తో తమ పాన్ ను అనుసంధానం చేసుకున్నారని సీబీడీటీ తెలిపింది. 12 కోట్ల పాన్ కార్డు దారులు ఆధార్ అను సంధానం చేయకపోగా అందులో 11.5 కోట్ల కార్డులు డీయాక్టివ్ అయినట్లు వెల్లడించింది. మధ్యప్రదేశ్ కు చెందిన ఆర్.టి.ఐ కార్యకర్త శేఖర్ గౌర్ దాఖలు చేసిన ఆర్.టి.ఐ దరఖాస్తుకు ఈ మేరకు సీబీడీటీ సమాధానం ఇచ్చింది.