అనన్య న్యూస్: గతంలో ఓ అభిమాని చేసిన పని వల్ల కంగారుపడ్డానని బాలీవుడ్ నటి నుష్రత్ తెలిపింది. అతడు అలా ఎందుకు చేశాడో తనకు తెలియదని, బాలీవుడ్ సినిమా చత్రపతిలో కథానాయికగా నటిస్తున్న నుష్రత్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని క్రేజీ ఫ్యాన్ మూమెంట్ గురించి మాట్లాడారు. గతంలో ఓ అభిమాని మా ఇంటి ముందు చాలా బహుమతులు పెట్టి వెళ్లిపోయాడు అందులో రెండు ముక్కలైన లవ్ సింబల్ ఉందని దానిలో ఒకదానిపై నా పేరు, మరో దానిపై అతడు పేరు రాసి ఉందని, వాటిని చూసి షాక్ అయ్యాను అయితే ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు. అయితే ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు. అతడికి మా ఇంటి అడ్రస్ ఎలా తెలిసిందోనని భయం వేసిందని నుష్రత్ వివరించింది.
చత్రపతి రీమేక్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. టాలీవుడ్ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, వి.వి. వినాయక్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 12న ప్రేక్షకులకు ముందుకు రానుంది..