అనన్య న్యూస్: భారతదేశంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 2న జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం జరుపుకుంటున్నాం. భారతదేశ చరిత్రలో అతిపెద్ద పారిశ్రామిక విపత్తులలో ఒకటైన భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో కోల్పోయిన విలువైన జీవితాలను స్మరించుకునే రోజుగా ఈరోజు గుర్తించబడింది. ఈ రోజును జరుపుకోవడం వెనుక ప్రధాన లక్ష్యం, పారిశ్రామిక విపత్తులను నివారించడానికి, మానవ నిర్లక్ష్యం, పారిశ్రామిక ఉద్గారాల వల్ల ఏర్పడే పర్యావరణ కాలుష్యం, వాయు కాలుష్యం, నీరు, నేల, శబ్దం, అనేక ఇతర రకాల కాలుష్యాల కారణంగా పర్యావరణం చాలా కాలంగా రాజీపడింది. దీపావళినాడు కాల్చే క్రాకర్లు, పరిశ్రమల ద్వారా గ్యాస్ల లీకేజీ, పేలుళ్లు, రోజు రోజుకూ పెరుగుతున్న వాహనాలు, పరిశ్రమలు, గాలిలోకి వెలువడుతున్న ప్రమాదకర వాయువులు, ఓజోన్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ ఉద్గారాలతో గాలి కాలుష్యం పెరుగుతూనే ఉంది. మరెన్నో సహా అనేక అంశాలు కాలుష్యం పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి.
ఈ పెరుగుతున్న కాలుష్యం ప్రజల జీవన నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడానికి, స్వచ్ఛమైన నీటిని త్రాగడానికి, హక్కుతో చేసే నిర్లప్యలు కూడా కాలుష్యం ప్రపంచ సమస్యగా మారేందుకు, మన చుట్టూ ఉండే గాలి, మనం వాడే నీరు కాలుష్యం కావడానికి కారణమవుతుంది. మనకు తెలియకుండానే ప్రకృతిలో ఉండే వికృతాలను కూడా పెంచి పోషిస్తున్నాము, వాటిలో ముఖ్యంగా మొక్కలు.. ఈ మధ్య కాలంలో దారులకు ఇరుప్రక్కలా కనిపిస్తున్న ఒక వృక్షం విషపూరితమైనదని తెలిసి కూడా దానిని పెంచుతూనే ఉన్నారు. ఇది ప్రాణాలను హరించేసే చెట్టు. ఇక పంట పండించిన తరువాత మిగిలే వ్యర్థాలను తగలబెట్టే పనిలో గాలి కాలుష్యన్ని మనమే పెంచి పోషిస్తున్నాం. దీపావళినాడు, పెళ్ళిళ్లు, సంబరాల్లో కాల్చే బాణాసంచా కూడా గాలి కాలుష్యానికి కారకమే. విపరీతమైన ప్లాస్టిక్ వాడకం ఇవి మన నిర్లష్యాల జాబితాలో కొన్ని మాత్రామే నీటిని వృథా చేస్తూ, మురికిని రోడ్ల మీదకు వదిలేస్తూ పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నదీ మనమే. మన చర్యలే మనకు శాపాలుగా మారి మన ఆరోగ్యాన్ని హరించేస్తున్నాయి.
కాలుష్యాన్ని నియంత్రించడానికి చిట్కాలు:
మన ఇంట్లో ఉండే అస్థిర సేంద్రియ సమ్మేళనాలు (VOC) ఉత్పత్తులను శుభ్ర పరిచే (Cleaning) రసాయనాల నుండి వస్తాయి. ఉదాహరణకు శుభ్ర పరిచే ప్రోడక్ట్స్ లలో లిమోనెన్ ఉంటుంది, ఇది ఇంట్లో సహజంగా ఉండే ఓజోన్తో చర్య ద్వారా ఫార్మాల్డిహైడ్ ఏర్పడేలా చేస్తుంది.
తివాచీలు, Upholstery, దుమ్ము, పెంపుడు జంతువుల జుట్టు నుండి ఇంటి వాతావరణాన్ని శుభ్రంగా ఉంచండి.
ఆహార పదార్థాలను వేయించడం వల్ల నలుసు కాలుష్యం వస్తుంది, ముఖ్యంగా గ్యాస్ స్టవ్ పై, NO2 వాయు కాలుష్య కారకాలతో కలిసి ఉంటుంది. వంట చేసేటప్పుడు తగిన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి.
ప్లాస్టిక్ పదార్థాలను ఉపయోగించడం మానుకోవాలి. కాగితం సంచులు ప్రత్యామ్నాయ పరిష్కారం.
పీస్ లిల్లీ, గెర్బెరా డైసీ, ఇంగ్లీష్ ఐవీ వంటి మొక్కలను పెంచుకోవాలి, ఇవి గాలి నుండి కార్బన్ మోనాక్సైడ్ను తొలగించడంలో సహాయపడతాయి.